తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
2/ 4
ఈ నెల 17వ తేదీ నుంచి బతుకమ్మ ప్రారంభం కాబోతోందని.. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్ వెల్లడించారు.
3/ 4
మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని అన్నారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారని తెలిపారు.
4/ 4
రూ. 317.81 కోట్ల ఖర్చుతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నామని కేటీఆర్ తెలిపారు.