Harish rao vs Eetala : కొనసాగుతున్న డబుల్ వార్.. ఇళ్ల నిర్మాణంపై మంత్రి హారీష్ రావు
Harish rao vs Eetala : కొనసాగుతున్న డబుల్ వార్.. ఇళ్ల నిర్మాణంపై మంత్రి హారీష్ రావు
Harish rao vs Eetala : మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ మధ్య కౌంటర్, ఎన్కౌంటర్ కొనసాగుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఈటల రాజేందర్ విఫలమయ్యారని చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ సైతం నేడు మరోసారి డబుల్ ఇళ్ల నిర్మాణంపై చర్చను లేవనెత్తారు.
ఈ క్రమంలోనే డబుల్ ఇళ్ల కౌంటర్ పై ఆయన ఫైర్ అయ్యారు. తాను కూడా నియోజకవర్గంలో రెండు వేల ఇళ్లు నిర్మించానని చెప్పారు. కావాలంటే వాటిపై బహిరంగ చర్చకు సిద్దమని అన్నారు.
2/ 5
మరోవైపు రాష్ట్రంలో అనేకమంది కాలేశ్వరం బడా కాట్రక్టర్లు మంత్రి హరీష్ రావు నియోజకర్గంతో పాటు, ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్లో డబులు బెడ్ రూం ఇళ్లు నిర్మించారని , కాని తన నియోజకవర్గంలో మాత్రం అలాంటీ కాంట్రాక్టర్లు లేరని అన్నారు.
3/ 5
తన నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లకు అనుమతులు తెచ్చుకుని మొత్తం 2 వేల ఇళ్లను నిర్మించామని చెప్పారు. దానిపై ఎక్కడికైన చర్చకు సిద్దమని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావుపై ఆయన ఫైర్ అయ్యారు.
4/ 5
దీంతో మంత్రి హారీశ్ రావు సైతం నేడు మరోసారి డబుల్ ఇళ్లపై చర్చను లేవనెత్తారు. ఈటల రాజేందర్ ఓటమి భయంతోనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన నియోజకవర్గంలో నాలుగు వేల డబుల్ ఇళ్లకు అనుమతి తీసుకుని ఒక్కరికి కూడా ఇంట్లోకి పంపించలేదని అన్నానని చెప్పారు.
5/ 5
ఈ క్రమంలోనే తోటి మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి 4000 వేల మందికి , తాను 3600 మంది, తుమ్మల నాగేశ్వర్ రావు 2000 మందికి, ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం నగరంలో 400 మంది లబ్ధిదారులను ఇళ్లు నిర్మించి వాటిని అందించామని చెప్పారు.