తెలంగాణ... సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ స్కూల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మంత్రి పరిశీలించారు. తర్వాత పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు మంత్రి వేశారు. వాటికి స్టూడెంట్స్ చెప్పిన సమాధానాల్ని ఆసక్తిగా విన్నారు. కొందరు విద్యార్థులు తెలుగులో సరిగా పేర్లు కూడా రాయలేకపోవడంతో మంత్రి హరీష్ రావు అసంతృప్తి చెందారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారని టీచర్లను ప్రశ్నించారు మంత్రి. కొంతమంది పదో తరగతి విద్యార్థులు ఎక్కాలు చెప్పలేకపోవడంతో... మరోసారి మంత్రి అప్సెట్ అయ్యారు. చదువులు ఇలా ఏడిస్తే... ప్రపంచంతో ఎలా పోటీపడతారని మంత్రి ప్రశ్నించారు. పదో తరగతి విద్యార్థులు ఇలా అంతంతమాత్రంగా చదువుతుండటం ఎవరి తప్పు? అన్న ఫ్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.