రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగలో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలు చేశారు.