MINISTER HARISH RAO REVIEW ON PADDY PROCUREMENT IN SIDDIPETA DISTRICT VB MDK
Telangana: రైతులకు శుభవార్త.. 24 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు..
Telangana: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టి .. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపు రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ ప్రగతి పై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు చెల్లింపుల కు వీలుగా సీఎం రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని.. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో 24 గంటల్లో డబ్బులు జమ చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి అన్నారు.
4/ 10
మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కానీ వివరాలను వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
టార్ఫలిన్, గన్ని బ్యాగులు కొరత, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
అకాల వర్షాలు వల్ల పంట తడవకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారి దే బాధ్యత అని అధికారులకు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
ఈ టీలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజ మ్మీ ల్ ఖాన్ తదితరులు ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)