Harish Rao convoy Accident :మంత్రి హరీష్ రావు కన్వాయ్ యాక్సిడెంట్...ఆయన సేఫ్..

Harish Rao convoy Accident : మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన వెళుతున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌కి అడ్డంగా అడవి పందుల గుంపు రావడంతో.. వాటిని తప్పించడానికి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది..దీంతో ఒకదాని కొకటి వాహనాలు ఢికొన్నాయి. ప్రమాదంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కాగా ప్రమాదంలో డ్రైవర్‌‌తో పాటు ఆయన గన్‌మెన్‌కు గాయాలు అయ్యాయి. మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుండి హైదరాబాద్ వస్తుండగా దుద్దెడ క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయలైన వారిని ఆసుపత్రికి పంపించి..అనంతరం హైదరాబాద్ బయలు దేరారు మంత్రి హరీష్ రావు.