MIGRATORY SIBERIAN BIRDS AND LOCAL DEER MAKING EYE FEAST IN GODAVARI BACKWATERS IN NIZAMABAD MKS NZB
Nizamabad: పాస్పోర్ట్ లేకుండా ఖండాలు దాటొచ్చి.. స్థానిక జీవులతో కలిసి కనువిందు చేస్తూ..
‘పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు.. ఖండాలన్నీ దాటెళ్లు..’ అనే సినీ గీతం ఠక్కున గుర్తొస్తుంది అక్కడికొచ్చిన విదేశీ అతిథుల్ని చూస్తే. తమకు అనువైన వాతావరణం కోసం సైబీరియా నుంచి ప్రతి వేసవిలో వందలాది పక్షులు ఉత్తర తెలంగాణకు వలస వస్తాయి. స్థానికంగా ఉన్న నెమళ్లు, జింకలతోపాటు కనిపిస్తూ ప్రజలకు కనువిందు చేస్తాయి. ఆ సంగతులేవంటే..
ఖండాలు దాటి వచ్చిన విదేశీ కొంగల గిలిగింతలు.. గెంతులు వేస్తు ఆనందంగా ఆడుతున్న జింక పిల్లలు.. నాట్యం చేస్తున్న నెమళ్లు.. అబ్బో.. ఇవన్నీ ఒక్క ఫ్రేములో చూడటానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదేమో.
2/ 11
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ప్రస్తుతం నెలకొన్న దృశ్యాలివి. గోదావరి పరివాహక ప్రాంతమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వేసవి విడిది కోసం చుట్టాల్లా వచ్చి వాలిపోతున్న విదేశి పక్షులు.
3/ 11
ఆనందంగా గెంతులు వెస్తూ పరుగు పందేలు వేసుకుంటున్న లేడి పిల్లలు.. తన నాట్యం తో కట్టి పడేస్తున్న నెమలి.. ఈ దృష్యాల ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లలు దాటి వచ్చిన అరుదైన జాతి పక్షుల తో ఈ ప్రాంతం ప్రత్యేక శోభను సంతరించుకుంది.
4/ 11
వాతావరణం లో మార్పులను బట్టి పక్షులు తమకు అనుకూలమైన ప్రాంతాలను వెతుక్కుంటూ వెళతాయి. ముఖ్యంగా వేసవి, శీతాకాలాల్లో సైబీరియా నుంచి కొంగలు నిజామాబాద్ జిల్లాకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఈఏడాది కూడా అక్కడ విదేశీ పక్షుల సందడి వాతావరణం నెలకొంది.
5/ 11
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లోనూ విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. సైబీరియన్, యుగోస్లేవియా ప్రాంతాలకు చెందిన ప్లెమింగో జాతికి చెందినవిగా తెలుస్తోంది.
6/ 11
గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయట దర్శనమిస్తున్నాయి. ఆయా దేశాల్లో శీతల గాలులు చలిని తట్టుకోలేక ఎండవేడిమి వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది.
7/ 11
దక్కన్ పీఠభూమిలో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతానికి వలస వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.
8/ 11
సైబీరియన్ కొంగలతోపాటు స్థానికంగా ఉండే జింకలు కూడా సందడి చేస్తున్నాయి. గెంతులు వేస్తూ పరుగు పందేలు వెసుకున్నట్టుగా పరుగులు పెడుతున్నాయి. గుంపులు గుంపులుగా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
9/ 11
ఉదయం సాయంత్ర వేళాల్లో పక్షులు, జంతువులు బయటకు వస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు వాటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రకృతి అందాలు చూడతరమ అన్నాట్టుగా కనిపిస్తాయి.
10/ 11
ప్రతి యేట ఇదే తరహాలో ఇక్కడి విదేశీ పక్షులు సందడి కనిపింస్తుంది. కొత్త కొత్త జాతులు వింత పక్షులు వలస వస్తున్నాయని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు.
11/ 11
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని చేప పిల్లలను కొంగలు ఆహారంగా సేవిస్తాయి. సమీప గ్రామాల ప్రజలు కూడా వీటిని తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కొందరు ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు కొన్నాళ్లపాటు ఇక్కడే మకాం వేస్తారు.