అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి తెలుగింటి వంటల్లోని ప్రధాన ఆహార వస్తువులు ఏమిటో చెప్పకనే చెబుతుంది. తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట. పండుగ సందర్భాలలో చేసే ప్రత్యేకమైన తెలుగు వంటలకు ఏ మాత్రం తీసిపోకుండా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న చందంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని "హోటల్ 44" వంటకాల రుచులు అబ్బుర పరుస్తున్నాయి. మీరూ దీనిపై ఓ లుక్కేయండి.
షాద్ నగర్ పట్టణ శివారులోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో వెలసిన హోటల్ 44లో అందరికీ ఇష్టమైన ఆహారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ హోటల్ లో బగారా రైస్, నాటుకోడి కర్రీ, పాయ కర్రీ స్పెషల్ గా చెప్పవచ్చు. అంతేకాదు ఉదయం వేళ టిఫిన్స్ కు సంబంధించి రాగి దోష, రాగి ఇడ్లీ, రాగి పెసరట్టు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఇడ్లీ, వడ, దోష, ఉత్తప్ప, సెట్ దోశ లాంటి వంటకాలు సర్వసాధారణంగా లభిస్తాయి.
శుభకార్యాలు ఏవైనా వాటితో పాటు ఇతరత్ర సమావేశాలు, కార్యక్రమాలకు హోటల్ 44 పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఇక్కడ ఎలాంటి పార్టీలు జరుపుకున్నా అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. కన్వెన్షన్ హాల్ కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు లాడ్జింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉండడం విశేషం. ప్రత్యేకమైన వంటకాలకే కాదు ఇక్కడ ఏ కార్యక్రమం చేసిన ఆర్డర్ పై అన్ని వంటకాలు లభిస్తాయి. అంతేకాదు క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉంది.
నోరూరించే రుచులు తమ హోటల్ ప్రత్యేకత అని యజమాని ప్రవీణ్ తెలిపారు. హోటల్ 44లో నాటుకోడి కర్రీ, పాయ, రాగిముద్ద, బగారా రైస్, గోంగూర మటన్ ఎవర్ గ్రీన్ స్పెషల్ అని చెప్పుకొచ్చారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి పెసరట్టు లాంటి వివిధ రకాల వంటకాలు ఇక్కడ లభిస్తాయని పేర్కొన్నారు.