తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు (Alcohol price in Telangana) గురువారం నుంచే అమలులోకి వచ్చాయి. ధరల పెంపుతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
2/ 9
మద్యం రకాలను బట్టి రూ.20 నుంచి రూ.160 వరకు పెంచుతూ ఎక్సైజ్ శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. మద్యం ధరలు పెంచడంతో దేశంలో అత్యధిక మద్యం ధరలు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నిలిచింది.
3/ 9
వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. బీరు, స్కార్చ్, విస్కీ ఏది తీసుకున్నా ఒకటి రెండు బ్రాండ్లు మినహా అన్నింటిలో ఒక్కో బాటిల్‌పై కనిష్టంగా రూ.20, గరిష్టంగా రూ.300 వరకు ఉన్నాయి.
4/ 9
రాష్ట్రంలో భారీ రేట్ల కారణంగా పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా తెలంగాణలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అమ్మకాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
5/ 9
తెలంగాణలో ఓసీ ఫుల్ బాటిల్ (750 ఎంఎల్) రూ.640 ఉండగా, పశ్చిమ బెంగాల్లో రూ.580 ఉంటే.. మిగతా అన్ని రాష్ట్రాల్లో రూ.500లోపే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
బీర్ల (Beers) విషయానికొస్తే తెలంగాణలో కింగ్‌ఫిషర్ లైట్ (KingFisher) రూ.150 ఉండగా అదే స్ట్రాంగ్ కింగ్ ఫిషర్ (KF Strong)బీర్ తెలంగాణలో రూ.160 ఉంది.
7/ 9
అయితే ఏపీ (AP)లో ఇతర ఫారిన్ బ్రాండ్ బీర్లు (Foreign Brands) కూడా తక్కువ ధరకే దొరుకుతుండటం గమనార్హం. డేర్ డెవిల్ ఎక్స్ట్రా స్ట్రాంగ్ లాంటి బీర్లు రూ.125కే వస్తున్నాయి. రకరకాల పేర్లతో అక్కడ బీర్లు దొరుకుతున్నాయి.
8/ 9
ఇక తమిళనాడులో స్ట్రాంగ్ కేఎఫ్ లైట్ రూ.140, బెంగాల్లో రూ.130గా దొరుకుతున్నాయి.
9/ 9
గుజరాత్, బీహార్, మిజోరం, నాగాలాండ్‌లో లిక్కర్‌పై బ్యాన్ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. చాలా రాష్ట్రాలు ఆదాయం కోసం లిక్కర్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)