ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. వ్యవసాయం చేసే భూములను ప్లాట్లుగా మార్చేసి.. వాటిని కమర్షియల్ చేసేశారు. దీంతో వ్యవసాయ పొలం తగ్గుతూ.. ప్లాట్లు ఎక్కువగా అయ్యాయి. దీంతో మున్ముందు వ్యవసాయం పొలం ఉంటేది అని చెప్పుకునే రోజులు వస్తాయేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Image Credit:Istock (ప్రతీకాత్మక చిత్రం)
అయితే భూములకు ఒక్కసారిగా ధరలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా.. రీజినల్ రింగ్ రోడ్డు ఆ భూమి వైపు నుంచి వెళ్లడం లేదా.. ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది.. లేదా మరేదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్ట్ మనం తీసుకున్న స్థలం వద్ద ఏర్పాటు చేస్తే.. భూములకు ఎక్కువ ధరలు వస్తాయి. దీనిలో భాగంగానే ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR–Triple R)తో భూముల ధరలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పట్టణాలతో RRR అనుసంధానమై ఉంటుందని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ వెంచర్లు వేసి.. ప్లాట్లుగా వాటిని విక్రయిస్తున్నారు. దీంతో వాటిని ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చుతున్నారు. దీనిపై రైతులు భవిష్యత్తును ఊహించుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Image Credit:Istock (ప్రతీకాత్మక చిత్రం)