కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడ్రోజులుగా హిందూ ఆలయాల ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. ముందుగా బెజ్జూరు మండలంలోని అందుగుల గూడ గ్రామ సమీపంలోని ఉన్న మల్లన్న గుట్టపై శివమల్లన్న ఆలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆలయంలోని గణపతి, నాగదేవత, శివలింగం నంది విగ్రహాలను ధ్వంసం చేశారు. గర్భగుడిలో ఉండాల్సిన విగ్రహాలను పెకిలించి పగులగొట్టి భయటపడేశారు.
మూడ్రోజుల నుంచి మూడు ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని పోలీసులు వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని తెలియజేశారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం, దేవలయాల పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలియజేశారు.