హైదరాబాద్ ఓఆర్ఆర్, ఎల్ఈడి లైట్స్, తెలుగు న్యూస్, లెటెస్ట్," width="1200" height="800" /> హైదరాబాద్ రింగ్ రోడ్డుకు కొత్త కళ వచ్చింది. మొత్తం రింగు రోడ్డు పొడవున ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటిఆర్ నేడు సాయంత్రం ప్రారంభించారు.వీటి ఏర్పాటుతో ఓఆర్ఆర్ పై ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు.
కాగా మొత్తం ఓఆర్ఆర్పై 6వేల 340 పోల్స్ ఏర్పాటు చేసి వాటికి 13వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో 2018లోనే లైటింగ్ ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 136 కిలోమీటర్లతో మొత్తం 158 కిలోమీటర్ల మేర విద్యుత్ కాంతులతో ఓఆర్ఆర్ వెలిగిపోతోంది.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతీ 12 మీటర్లకు స్తంభం చొప్పున 136 కిలోమీటర్ల మార్గంలో 6వేల 340 స్తంభాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు... ఔటర్ అప్ అండ్ డౌన్ ర్యాంప్‌లు, పలు జాతీయ, రాష్ట్రీయ రహదారుల అనుసంధానమైన ప్రాంతాల్లో కూడా ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఇంటర్‌ఛేంజ్‌లు, అండర్‌పాస్‌లలోనూ వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.