KNOW THE RULES AND PROCESS TO GET NEW ASARA PENSIONS IN TELANGANA HERE IS THE DETAILS AK
Asara Pension: తెలంగాణలో ఆసరా పింఛన్ పొందాలనుకుంటున్నారా ? నిబంధనలు ఇవే.. పూర్తి వివరాలు..
Asara Pensions: గతంలో సర్వే ప్రకారం కొత్తగా 8.5 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అయితే మరోసారి సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలని భావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్ అర్హత వయసు తగ్గించింది. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా ఎవరికి పింఛన్ ఇవ్వొచ్చనే దానిపై ప్రత్యేక సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
గతంలో సర్వే ప్రకారం కొత్తగా 8.5 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అయితే మరోసారి సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలని భావిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఇక కొత్తగా పింఛన్ పొందాలనుకునేవారు తమ వయసు గుర్తింపు పత్రం తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ గుర్తింపు పత్రం లేకుంటే కుటుంబసభ్యుల వయసు ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మూడెకరాలకు మించి తరి, 7,5 ఎకరాలకు మించి మెట్ట భూములన్న వ్యక్తులు, ప్రభుత్వం, ప్రభుత్వరంగ, ప్రైవేటు, పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులు పిల్లలు ఉన్నవారు పింఛన్ల పొందేందుకు అనర్హులు. సొంత దుకాణాలు, సంస్థలు ఉండకూడదు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అయితే తనిఖీ అధికారి వృద్ధుల జీవనశైలిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఫోటో, ఆధార్ నంబర్, బ్యాంక్ పాసుపుస్తకం, వయసు ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకుంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అధికారులు పరిశీలంచి అర్హులను గుర్తిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
గ్రామాల్లో ఎంపీడీవోలు, హైదరాబాద్లో తహసీల్దార్లు, జీహెచ్ఎంసీ పరిధిలో డిప్యూటీ కమిషనర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం 65 ఏళ్లు దాటిన 37.48 లక్షల మందికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)