హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. లహరి-అమ్మఒడి అనుభూతిగా (Lahari AC Sleeper bus) నామరణం చేసిన ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో సేవలు అందించనున్నాయి.