దేశంలో గూడ్స్ రైలు యావరేజ్ స్పీడ్ 24 కిలో మీటర్లు ఉంటే..చైనాలో 120 కిలోమీటర్లు, ఆస్ట్రేలియాలో 80 కిలోమీటర్లు, అమెరికాలో 75 కిలోమీటర్లు ఉందన్నారు. ఇండియన్ ట్రక్ స్పీడ్ 50 కిలోమీటర్లు ఉంటే..చైనాలో 70 కిలోమీటర్లుగా ఉందన్నారు. గూడ్స్, ట్రక్ స్పీడులోనూ విదేశాలతో పోటీ పడలేకపోవడం దారుణమన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందన్నారు కేసీఆర్. చైనా నుంచి అనేక కంపెనీలు తరలివెళ్తున్నాయని..మరి వాటిని కేంద్రం ఎందుకు ఆకర్షించడం లేదన్నారు. భారత్ రాష్ట్ర సమితి ఒక మిషన్ అని....మిషన్ మోడ్లో పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ వచ్చే వరకు దేశంలో మార్పు రాదన్నారు.