Eetala Rajender : హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసిఆర్ వ్యవహరశైలి..అనుసరిస్తున్నతీరుపై ఆయన మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే మూడోరోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ మరోసారి సీఎం పై ఫైర్ అయ్యారు.. తెలంగాణ ప్రజలు సీఎం కేసిఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు. రాష్ట్రంలో చాలా మంది టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఇక సీఎం ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలని చూస్తున్నారని అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఆదీనంలో ఉండదని అన్నారు.రానున్న ఎన్నికల్లో కేసిర్కు నచ్చిన పోలీంగ్ అధికారులను నియమిస్తే..చూస్తూ..ఊరుకోనని అన్నారు.
3/ 5
హుజురాబాద్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. సీఎం కేసిఆర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని..అధికారం బలంతో తన నియోజకవర్గంలోని పోలీసు అధికారులను మారుస్తున్నారని విమర్శించాడు.
4/ 5
ఇక సీఎం నాయకులను కొనవచ్చు గాని ప్రజలను కొనుగోలు చేయలేరని దుయ్యబట్టారు. బిజెపి కార్యకర్తలను అడ్డుకోవడం కేసిఆర్ జేజెమ్మ తరం కాదని అన్నారు. (ఈటల రాజేందర్ (ఫైల్)
5/ 5
ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను ఆపడం ఎవరి తరం కాదని , ఈ నేపథ్యంలోనే పెన్షన్లు సీఎం కేసిఆర్ తాతా జాగీర్ కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తన బర్తరఫ్ తెలంగాణ ప్రభుత్వానికి అరిష్టమని అన్నారు.