కరీంనగర్ నుండి బస్ లో వరంగల్ బయలుదేరాడు. బస్టాండ్ లో దిగాడు రమేష్ అనే వ్యక్తి . అక్కడే ఓ మహిళని చూశాడు . ఇద్దరి చూపులు కలిశాయి . మత్తెక్కించిన మగువ కొంటె సైగలు చేయడంతో కోరిక పుట్టింది . అతగాడి కక్కుర్తి అర్థమైన మహిళ ఎంచక్కా ఎంజాయ్ చేద్దామనడంతో ఎగిరి గంతేశాడు . కళ్లు మూసుకుపోయి ముక్కూముఖం తెలియకపోయినా ఆమె వెంట వెళ్లిపోయాడు . ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది విటుడికి . ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో సడెన్ గా ఆమె భర్త ఎంట్రీ ఇచ్చాడు . ఇక కథ మామూలే . అతన్ని బెదిరించి డబ్బులు బ్యాగ్ పట్టుకుని కిలాడీ జంట అక్కడి నుంచి చెక్కేసింది . లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఈ నెల 23 వ తేదీన ఓ వ్యక్తి కరీంనగర్ నుంచి బస్సులో వరంగల్ వచ్చాడు . (ప్రతీకాత్మక చిత్రం)
బస్టాండ్ లో ఓరగా చూస్తోన్న మహిళను చూసి జారిపోయాడు . అతన్ని నమ్మించిన మహిళ ఎంజాయ్ చేద్దామంటూ ఆటోలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లింది . ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ముందస్తు ప్లాన్ ప్రకారం ఆమె భర్త ఎంట్రీ ఇచ్చాడు . కిలాడీ జంట అతనిపై దాడి చేసి రూ .70 వేలు ఉన్న బ్యాగును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు . (ప్రతీకాత్మక చిత్రం)
యువకులకు వలపు వల విసిరి దోచుకోవాలని కంత్రీ స్కెచ్ గీసింది. అందులో భాగంగానే ఈ నెల 23 న బస్టాండ్ లో ఓ వ్యక్తిని ముగ్గులోకి దించి దోచుకెళ్లారు . మరొకసారి దోపిడీకి పాల్పడేందుకు నగరంలోకి వస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు . నగర శివార్లలో తనిఖీలు చేపట్టి బైక్ పై వస్తున్న కిలాడీ జంటను పోలీసులు అరెస్టు చేశారు . (ప్రతీకాత్మక చిత్రం)