తెలంగాణ ఆవిర్భావానికి ముందు సోనియాగాంధీ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే స్టేడియంలో ఈ సభను నిర్వహించడమే కాకుండా వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నుంచి మేనిఫెస్టోలోని ముఖ్యాంశా లను ప్రకటిస్తే బాగుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
తొలుత ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పాదయాత్రలో భాగంగా ఈ నెల 7న గంగాధర క్రాస్ రోడ్డు వద్ద జరిగిన లో సభ నిర్వహించి తీరుతామని రేవంత్ కార్నర్ మీటింగ్ త్ హెచ్చరించారు. ఇక స్థానిక నేతలు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీపీని కలవగా షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే సభ నిర్వహించేలా అనుతులు ఇచ్చారు.
కరీంనగర్ లో జరిగే సభకు లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నా రు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడానికి ఆదివారం కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు, అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంఛార్జిలు, జిల్లాలోని ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయని, మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో, సానుభూతిపరులు, ఓటర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నదని సమాచారం.