Telangana : ఆ చెట్టు ఆకులు తెంచినా.. అక్కడ మాట్లాడినా అరిష్టమట..ఇంతకీ ఏంటా సీక్రెట్.. ఆ చెట్టు ఎక్కడుంది..?
Telangana : ఆ చెట్టు ఆకులు తెంచినా.. అక్కడ మాట్లాడినా అరిష్టమట..ఇంతకీ ఏంటా సీక్రెట్.. ఆ చెట్టు ఎక్కడుంది..?
Telangana: అదో మహావృక్షం. వెయ్యేళ్లకుపైగా చరిత్ర కలిగిన పూరాతన చెట్టు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ చెట్టు నుంచి ఆకులు తుంచితే అరిష్టమని అక్కడి వాళ్లు అంటున్నారు. అందుకే ప్రతి బుధ, శుక్రవారాల్లో ఆ చెట్టు దగ్గర ఎలా ఉంటుందో తెలుసా..
ప్రాంతానికో ఆచారం. ఒక్కో ప్రదేశంలో ఒక్కో సెంటిమెంట్...కొన్ని చోట్ల అక్కడి స్థానికుల నమ్మకం ఒక్కో విధంగా ఉంటుంది. జగిత్యాల జిల్లాలో కూడా అలాంటి నానుడే ఒకటి ప్రచారంలో ఉంది. అదేంటో తెలిస్తే నిజంగా ఈరోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయా అనే ఆశ్చర్యం అందరిలో కలుగుతుంది.
2/ 13
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో సుమారు 4500 మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఊరి మధ్యలో భక్తుల మర్రి ఉంది. ఈ మర్రిచెట్టు 2000 ఏళ్ల నాటిదని ఇక్కడివారు చెబుతుంటారు.
3/ 13
భక్తుల మర్రి చెట్టు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. చెట్టు మొదలులో వేల సంవత్సరాల క్రితమే అమ్మవారు కొలువయ్యారు. దాంతో అప్పటినుండి ఇక్కడ ప్రతి శుక్ర, బుధవారాల్లో కోర్కెలు కోరుతూ మెుక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
4/ 13
గత కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మి అనే మహిళ ఇక్కడి చెట్టు ఆకులను తెంపి వాటితో ఇస్తరాకులు కుట్టేవరట. అయితే ఇక్కడ మహశక్తి అమ్మవారు ఉండటం వల్ల ఆ చెట్టు ఆకులు తెంపటంతో ఆమెకు అనారోగ్యానికి గురైనట్లుగా స్థానికులు చెబుతుంటారు.
5/ 13
అందుకే పైడిమడుగు గ్రామంలో ఉన్న ఈ భక్తుల మర్రి చెట్టును ఇక్కడి స్థానికులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. చెట్టు ఆకులను తెంపటం జరగదు. అలాగే చెట్టు దగ్గర మాట్లాడుకోరు. ఆకులు తెంపించే అమ్మవారికి కోపం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు.
6/ 13
ఇక మాట్లాడుకోకపోవడం వెనుక కూడా ఓ విషయాన్ని చెబుతుంటారు. మాట్లాడితే నోటిలోని తుప్పిర్లు ఆకుపైన పడితె అపవిత్రంగా చూస్తారు ఇక్కడి స్థానికులు. అందుకే ఈ రెండు పనులు చేయకుండా గత కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ చెట్టును కాపాడుకుంటు వస్తున్నారు.
7/ 13
ప్రతీ వేసవి కాలంలో ఈ చెట్టు ఎండిపోయి ఊడలు పడిపోయినప్పటికి ఒక్క కర్ర ముక్కను కూడా గ్రామస్తులు ముట్టుకోరని చెబుతుంటారు. ఈ చెట్టు వద్ద అమ్మవారు కొలువయ్యారు కాబట్టి కోరిన కోర్కెలు తీర్చుతుందని వారి నమ్ముతుంటారు.
8/ 13
ఈ సెంటిమెంట్ కారణంగనే ఈభక్తుల మర్రిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు కరీంనగర్‌తో పాటు నిజామాబాద్, హైదరాబాద్, ముంబై, ఆదిలాబాద్, వరంగల్‌తో పాటు వేర్వేరు ప్రాంతాల నుండి జనం వస్తుంటారు.
9/ 13
ఇక్కడికి భక్తులు ప్రతి శుక్రవారం, బుధవారాల్లో పెద్ద సంఖ్యలో వచ్చివారి మెక్కులు చెల్లించుకుంటారు. అయితే ఒకే చోట రెండు ఆలయాలు కట్టారు. ఒకటి మహశక్తి అమ్మవారు కాగ మరకటి లక్ష్మి అమ్మవారుగా కొలుస్తారు.
10/ 13
గత కొన్నేళ్లుగా ఇక్కడ మొక్కులు తీర్చుకొని జంతు బలి ఇచ్చే వారు. ఒక ఆలయంలో మెక్కులు చెల్లించుకుంటే, మరో ఆలయంలో ఎలాంటి మాంసాహారాలు తినకుండా దర్శనం మాత్రమే చేస్తుంటారు. అందుకే ఈ అమ్మవారు గ్రామాన్ని రక్షిస్తారని స్థానికులు చెబుతుంటారు.
11/ 13
ఐదెకరాల్లో ఉన్న ఈ చెట్టు నాలుగైదేళ్ల క్రితం ఎండిపోయింది. గ్రామస్తులు, కొందరు ఎన్ఆర్ఐలతో పాటు గల్ఫ్ కార్మికులు చెట్టును కాపాడుతూ వస్తున్నారు.దీంతో పచ్చని పైర్ల మధ్య మర్రి చెట్టు పచ్చగా కనిపిస్తూ భక్తులతో సందడిగా కనిపిస్తోంది.
12/ 13
ఇంతటి చరిత్ర కలిగిన ఈ చెట్టును ప్రభుత్వం సంరక్షించి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా మారుతుందని స్థానికులు కోరుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా ఉన్న మహబూబ్‌నగర్‌లో ఉండగా ఇది రెండవది అతిపెద్ద మర్రి చెట్టు అంటున్నారు గ్రామస్తులు.
13/ 13
గ్రామస్తుల సెంటిమెంట్‌నే కాదు భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చరిత్ర కలిగిన మహావృక్షాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటున్నారు కొందరు భక్తులు. ఈరోజుల్లో ఇలాంటి వాటిని కూడా నమ్ముతారా అంటున్నారు మరికొందరు నాస్తికులు.