కరీంనగర్ కార్పోరేషన్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. అద్దె వాహనాల పేరుతో నెలకు లక్షల రూపాయాలను అధికారుల అండదండలతో కాజేస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరీంనగర్ నగర పాలక సంస్థలో 21వాహనాలను అద్దె ప్రతిపాదికన తీసుకోవడానికి గతేడాది మార్చి 31న జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానం ప్రవేశ పెట్టగా అనుమతి పోంది అమోదించబడింది.
ఈ వాహనాలను అధికారులు, ప్రజా ప్రతినిధులకు కేటాయించాలని నిర్ణయించారు. అయితే వాహనాలను ఎంపిక చేసే ముందు ఆయా వాహనాలకు సంబంధించిన యజమానుల వివరాలు, వెహికల్ ఫిట్నెస్ , ఇన్సూరెన్స్ , టాక్సీ ప్లేట్ , పొల్యూషన్,రోడ్ టాక్స్ ,డ్రైవర్ వివరాలు ,డ్రైవర్ బ్యాడ్జి ,ట్రాఫిక్ ఉల్లంఘనల పెండింగ్ చాలాన్ల వివరాలు పరిశీలించాల్సి ఉంటుంది.
అలాగే మున్పిపల్ కమిషనర్ తిరుగుతున్న వాహననంTS22T1239 బ్లాక్ కలర్ ఇన్నోవాని ఆర్టీఐ సమాచారంలో చూపెట్టారు. కానీ మున్పిపల్ కమిషనర్ తిరుగుతున్న వాహనం ఒక నంబర్ లేకుండా వాడుతున్న తెలుపు కలర్ ఇన్నోవా వాహనం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు రికార్డు ప్రకారం కేటాయించింది TS02 UC1220 కానీ .. ఆయన TS15UD3349వాహానాన్ని వినియెగిస్తున్నారు.
డిప్యూటీ కమిషనర్ కుTS02UC3675 టాయించగా ఆయన వినియెగిస్తున్నారు. TS02EX9567 నంబర్ గల తెలుపు నంబర్ వాహనంలో డిప్యూటీ కమిషనర్ సైన్ బోర్డ్ తో తిరుగుతున్నారు. సుమారు 10 వాహనాలను నగరానికి చెందిన ఎడబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన సాయి తిరుమల టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన వాహనాలు ఉండగా, శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన 2 వాహానాలు ,నర్సింహా ట్రావెల్స్ కు చెందిన 2 వాహానాలు ,కృష్ణ ట్రావెల్స్ కు చెందిన 2 వాహానాలు ,స్నేహా ట్రావెల్స్ కు చెందిన 2 వాహానాలు ఉన్నాయి.