MLA Seethakka: గంగవ్వకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన సీతక్క..ఏంటంటే?
MLA Seethakka: గంగవ్వకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన సీతక్క..ఏంటంటే?
MLA Seethakka: తన సహజ నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన యూట్యూబ్ స్టార్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ బిగ్ బాస్ షోతో మరింత మందికి చేరువయింది. ఆ తరువాత అనారోగ్య కారణాల రిత్యా ఆ షో నుండి బయటకు వచ్చింది. ఇక తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గంగవ్వకు అదిరిపోయే గిఫ్ట్ పంపింది. ఆ గిఫ్ట్ ఏంటంటే? P.Srinivas,New18,Karimnagar
తన సహజ నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన యూట్యూబ్ స్టార్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ బిగ్ బాస్ షోతో మరింత మందికి చేరువయింది. ఆ తరువాత అనారోగ్య కారణాల రిత్యా ఆ షో నుండి బయటకు వచ్చింది.
2/ 6
ఇక గంగవ్వ సొంతంగా నిర్మించుకోవాలన్న ఇంటి కలను నిజం చేసుకుంది. ఈ మేరకు హీరో నాగార్జున కూడా ఆమెకు కొంత ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ప్రస్తుతం ఆమె స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో నిర్మించుకున్న ఇంట్లో నివాసం ఉంటుంది.
3/ 6
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్చ్చ్ చీఫ్ రేవంత్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర జగిత్యాల పూడూరు వద్దకు చేరుకుంది.
4/ 6
ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని గంగవ్వ కలిశారు. అలాగే రేవంత్ స్వయంగా తన చేతులతో వేసిన మిర్చి బజ్జిలను అందజేశారు. ఈ సమయంలో రేవంత్ పక్కనే ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా గంగవ్వను ఆప్యాయంగా పలకరించారు.
5/ 6
ఈ క్రమంలో గంగవ్వ సహజత్వానికి ఆకర్షితురాలైన సీతక్క ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ పంపించాలని అనుకున్నారు.
6/ 6
ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్ తో చీర పంపించారు. వారు మంగళవారం మల్యాల మండలం లంబాడిపల్లిలోని గంగవ్వ ఇంటికెళ్లి ఆమెను శాలువాతో సన్మానించి ఆమెకు సీతక్క పంపించిన చీరను అందజేశారు.ఎమ్మెల్యే సీతక్క తనకు చీర పంపడంతో గంగవ్వ ఆనందం వ్యక్తం చేశారు.