KARIMNAGAR MASONRY WORKERS FOLLOWING CORONA RULES WITH DIFFRENT WAY IN JAGITYAL DISTRICT VB KNR
Telangana: కరోనా కాలం.. తాటికమ్మ దూరం.. కల్లు గీత కార్మికుల ప్రయోగం..
Telangana: కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్ లేనిదే భయటకు అడుగు పెట్టడం లేదు. అలాగే వ్యాపారాలు చేసుకునే వారు భౌతిక దూరం పాటిస్తూ తమ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే కల్లు గీత కార్మికులు కూడా ఒక వినూత్నంగా ఆలోచించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటించేలా ఒక తాటి ఆకును ఒక గుంజకు తాడుతో కట్టి అవతలి వైపు నుంచి కల్లు పోస్తుంటే మరో వైపు నుంచి కల్లు తాగుతున్నారు.
2/ 5
ఈ ఉపాయం బాగుందని తాటి వనంలో ఇతరులు కూడా దీనిని అనుసరిస్తున్నారు. ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన గుగ్గిళ్ల రవిగౌడ్ అనే గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించి కరోనా నిబంధనలను పాటిస్తున్నాడు.
3/ 5
అంతే కాకుండా కల్లు మండువాకు వచ్చే ప్రతీ ఒక్కరికీ శానిటైజర్ అందజేసి , మాస్క్ ధరించేలా చెబుతున్నాడు.
4/ 5
కల్లు సేవించేవారికి తనకు మధ్య దూరం ఉండేలా తాటికమ్మ ఆధారంగా కల్లు పోస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మరింది.
5/ 5
దీంతో గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకకుండా అందరూ భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే కరోనా మన దరి చేరదంటూ సూచిస్తున్నారు