స్వయంకృషితో ఎదగాలన్న ఆలోచన.. సమాజంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో పిండి వంటకాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు ఇక్కడి మహిళా మణులు. పిండి వంటలు చేసే వారు కోట్లు సంపాదించడం ఏంటని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి మహిళ గ్రూప్ సభ్యులు అవి మాటలు కాదు చేతలు అని నిరూపిస్తున్నారు. ఎక్కడైనా పిండి వంటలు మాములుగానే చేస్తారు. కాని ఇక్కడ తయారు చేసే పిండి వంటలకు ఓ స్పెషాలిటీ ఉంది.
సుల్తాన్పూర్ గ్రామంలో మహిళా సంఘం సభ్యులు చేసే పిండి వంటలు ఒక్కోటి 1 కిలో చొప్పున ఉంటుంది. అందుకే వీటికి మార్కెట్లో అంత డిమాండ్. స్థానికులే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి నిత్యం ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడి పిండి వంటకాలను వేరే రాష్ట్రాలు, విదేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మొదటగా ఒక గ్రూపు తో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు ఏడు గ్రూపులుగా అభివృద్ధి చెందింది.
గతంలో జీతం వచ్చే విధంగా ఉండే పిండి వంటకాల ఆదాయం ఇప్పుడు ఏడాదికి కేవలం విదేశాలకు ఎగుమతి చేసే పిండి వంటకాల ద్వారానే నాలుగు కోట్ల టర్నోవర్కి చేరుకుంది. లడ్డు, సకినాలు, అరిసెలు, కరియలు. మాములుగా ఎక్కడైనా కిలో కొంటే 10 నుంచి 15 లడ్లు, సకినాలు వస్తాయి. కాని ఇక్కడ తయారు చేసే పెద్ద సైజు పిండి వంటకాలు ఒక్కొక్కటే కిలో ఉంటుంది.
మహిళల చేత నెలకోల్పబడిన ఈ స్వయం ఉపాధి పరిశ్రమ ద్వారా 50మంది ఆడవాళ్లతో పాటు పిండి మరపట్టే వాళ్ల దగ్గర నుంచి చేసిన పిండి వంటకాలను షాపులు, కిరాణా దుకాణాలకు తరలించే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్లకు ఉపాధి పొందుతున్నారు.చిన్న చిన్న చిల్లర షాపులతో మొదలైన ఈ పిండి వంటకాల సేల్స్ ఇప్పుడు చుట్టు పక్కల అన్నీ కిరాణషాపులు, ఇతర దుకాణాల్లో దొరికే విధంగా లోకల్ మార్కెటింగ్ చేసుకున్నారు.
ఒక ఊర్లో మొదలైన పిండి వంటకాలు ఇప్పుడు ఐదు గ్రామాలుకు విస్తరించింది. వీరందరూ పిండి వంటలు చేస్తూ ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శుభకార్యాలకు ఆర్డర్లపై పిండి వంటకాలుతో పాటు కూడా ఎన్నో రకాల స్వీట్స్ ను తయారు చేస్తున్నారు.నాణ్యమైన సరుకులను తెచ్చి సరసమైన ధరలకు ఇస్తున్నామని మహిళా సంఘం సభ్యులు చెబుతున్నారు.