ఎన్నో నమ్ముతున్నాం .. అందులో భాగంగానే ఇలా ఒక్కరోజు బయట ఉండి చూస్తున్నామనేలా ' .. ఊరి జనం తమ మనసులోని మాటను వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటు పోలీసుశాఖ తరపున రాత్రి వేళల్లో మూఢనమ్మకాలతోపాటు ప్రజల జీవనశైలిపై పలురకాల అవగహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నా .. అక్కడక్కడ ఇలాంటి విధానాలను పలువురు అవలంబిస్తున్నారు.
ఇంకా పల్లెల్లో మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణగా జనం చూస్తున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో గుప్తనిధుల కోసం రాత్రివేళల్లో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. పోలీసుల చర్యలతో అవి తగ్గుముఖం పట్టాయనుకుంటే ఇప్పుడు ఈ మూఢనమ్మకాల ప్రచారం ప్రజల్ని వెంటాడుతోంది.
2017 జూలైలో హుజూరాబాద్‌లోని ఓ కుటుంబం మంత్రాల నిందారోపణలతో బలైపోయింది. దంపతులతోపాటు ముగ్గురు పిల్లలు నాటి ఘటనలో బలవన్మణానికి పాల్పడ్డారు. నాటి ఘటన తర్వాత ప్రజల్లో ఉన్న అపనమ్మకాలను తొలగించేలా ప్రయత్నాలు కొంత వరకు ఫలితాన్నిచ్చినప్పటకీ .. అక్కడక్కడ ఇలాంటి మూఢవిశ్వాసాల ఆనవాళ్లు ఇంకా వెలుగుచూస్తునే ఉన్నాయి.