Summer: బీ కేర్ ఫుల్..ఓ పక్క ఎండలు..మరోపక్క జ్వరాలు..ఆసుపత్రుల పాలవుతున్న జనాలు!
Summer: బీ కేర్ ఫుల్..ఓ పక్క ఎండలు..మరోపక్క జ్వరాలు..ఆసుపత్రుల పాలవుతున్న జనాలు!
Summer Effect: మార్చి నెల ఇంకా ముగియనే లేదు. అప్పుడే ఎండలు ప్రజల్ని అల్లాడిస్తున్నాయి. 12 దాటితే చాలు మొహం మాడిపోయే ఎండ వచ్చేస్తుంది. ఓ వైపు ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం..మరోవైపు వైరల్ జ్వరాల బాధితులు పెరుగుతుండడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Summer Effect: మార్చి నెల ఇంకా ముగియనే లేదు. అప్పుడే ఎండలు ప్రజల్ని అల్లాడిస్తున్నాయి. 12 దాటితే చాలు మొహం మాడిపోయే ఎండ వచ్చేస్తుంది. ఓ వైపు ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం..మరోవైపు వైరల్ జ్వరాల బాధితులు పెరుగుతుండడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
2/ 11
వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, రామగుండం, జగిత్యాల సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీలను తాకుతుండటంతో వేడి జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.
3/ 11
ఒక్కో ఆసుపత్రి వద్ద వందల మందికి పైగా జ్వర పీడితులు ఉంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలలో జ్వరం, వాంతులు విరోచనాలతో క్యూ లైన్లలో వేసవి జ్వరాల బాధితుల్ని చూస్తున్నామని చెబుతున్నారు.
4/ 11
కండరాలు పట్టేయడం, సొమ్మసిల్లడం, నీరసించిపో వడం, చెమటలు పట్టడం, నాలుక తడారిపోవడం, వాంతులు, నీళ్ల విరేచనాలు, కళ్లు తిరగడం, తలనొప్పి తదితర లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తుండటం గమనార్హం.
5/ 11
ఎండలో ఎక్కువగా తిరిగే వారు ఎక్కువగా ఈ జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ద్విచక్రవాహనాలపై తిరిగే వారు వేసవి, జ్వరాల బారిన పడే ముప్పు పొంచి ఉందని వారు వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
రేకుల ఇళ్లు, మేడల్లో బాగా పై అంతస్తుల్లో ఉండేవారు, బస్సుల్లో తిరిగే వారు కూడా వేసవి ప్రభావానికి గురవుతున్నారు. పరిశుభ్రమైన నీరు తాగకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అనేది వైద్యుల మాట.
7/ 11
ప్రధానంగా హోటళ్లు, దుకాణాలు, బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్ల వద్ద ఏ నీరు పడితే ఆ నీరు తాగడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆహార విషయంలో కేవలం ఆరోగ్యమైన పదార్థాలు మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
8/ 11
ఇక ఎక్కువగా ఇంట్లో తయారు చేసే పండ్ల రసాలను తీసుకోవాలి. బియ్యంతో చేసిన పానీయాలు తీసుకోవడం మంచిది. నీటి శాతం కోల్పోతున్న వారు తాగే నీరులో ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
9/ 11
8 గంటలకు బయటకు వెళ్లి సాయంత్రం 6 గంటల్లోపు ఇంటికి తిరిగి రావాలి. ఎండల్లో తిరిగే వారు తప్పనిసరిగా గొడుగులు టోపీలు ధరించాలి. వాంతులు, విరోచనాలు అవుతున్నప్పుడు ఎక్కువ నీరు తాగాలని డాక్టర్లు అంటున్నారు. ఎట్టి పరిస్థితిలో రోడ్ల పక్కన విక్రయించే ఆహారం తినకూడదు.
10/ 11
అపరిశుభ్రమైన నీరు తాగకపోవడం మంచిది. ఎండకాలంలో ఎక్కువ మాంసం, గుడ్లు, నూనె పదార్థాలు జోలికి వెళ్లకుండా ఉండాలి. తాజాగా ఉండే ఆకుకూరలు మాత్రమే తీసుకోవాలని వైద్యులు అంటున్నారు.
11/ 11
గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఏప్రిల్, మే, జూన్ మాసంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.