Lockdown: తెలంగాణలోని ఆ జిల్లాలో మళ్లీ లాక్ డౌన్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా..
Lockdown: తెలంగాణలోని ఆ జిల్లాలో మళ్లీ లాక్ డౌన్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా..
Lockdown: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ అక్కడ 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది . దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలగే పల్లెల్లో కూడా మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
దీంతో స్వచ్ఛందంగా గ్రామాల ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇప్పటికే వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించారు. ఆగస్టు ఫస్ట్ తో లాక్ డౌన్ ని ఎత్తివేశారు. కరోనా థర్డ్ వేవ్ భయంతో సెల్ఫ్ లాక్ డౌన్లతో గ్రామాలు కట్టడి చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెలుగుమట్లలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. కాగా సోమవారం కరోనాతో ఒకరు చనిపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
గ్రామంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసుల నమోదయ్యాయి. మంగళవారం నుంచి పదిహేను రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం )
6/ 7
ఆ నిబంధనలు పాటించకపోతే రూ.1000 ఫైన్ విధిస్తామని గ్రామపంచాయతీ పాలక వర్గం వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)