ఈ ఏడాది ఆడబిడ్డలు మురిసేలా సద్దుల బతుకమ్మ చీరలు సిద్ధమైనాయి . జరి అంచులతో రామ భాణం , గులాబీ , దమయండి , గుమ్మడి పువ్వు రంగు , టమాట , పచ్చ రంగులే కాకుండా ఇలా వంద వర్ణాలతో 859 డిజైన్లతో చూడ ముచ్చటగా రూపు దిద్దుకున్నాయి . ఈసారి యువతుల కోసం ప్రత్యేకంగా లంగా వోణీ చీరలను తయారు చేశారు . సిరిసిల్ల నేతన్నల చేతుల మీదుగా ఏడున్నరకోట్ల మీటర్లు చీరలను సిద్ధం చేశారు . రేపటి లోగా నేత పూర్తికానుంది . అక్టోబర్ మొదటి వారం లో చీరలను రేషన్ దుకాణాల ద్వారా తెల్ల కార్డు దారులకు అందనున్నాయి .
బతుకమ్మ చీరల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆడబిడ్డలు మురిసేలా రంగురంగులతో చీరలను తయారు చేయిస్తోంది . సిరిసిల్లలో ఇందు కోసం 15 వేల మరమగ్గాలను ఆధునీకరించారు. సిరిసిల్లలోని మగ్గాలపై ప్లేన్ చీరలు, టెక్స్టైల్ పార్కులోని రేఫియర్ సాంచాలపై చెక్స్ , కొత్త డిజైన్లతో తయారు చేస్తున్నారు . ఏడున్నర కోట్ల మీటర్లు , కోటి చీరలను సిద్ధం చేస్తున్నా రు. ఇప్పటివరకు 90 లక్షల చీరలు సిద్ధమైనాయి.
ఇక్కడ తయారైన చీరలకు హైదరాబాద్ లోని కాటేదాన్‌లో 15 ప్రాసెసింగ్ యూనిట్లలో ఫినిషింగ్ చేశారు. గట్టాలతో ప్యాకింగ్ చేసి వెంట వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు లారీల ద్వారా తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా ముందు వచ్చే సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భం గా ప్రతి ఆహార భద్రత కార్డుదారు కుటుంబంలో 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు ఎంతమంది ఉంటే అంత మందికి చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది .
ఇందుకు సంబంధించిన చేనేత చీరల ఉత్పత్తి ఆర్డర్లను ఎక్కువ. శాతం సిరిసిల్లకు ఇవ్వడం శుభసూచకం . ఏడు కోట్ల మీటర్ల చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చారు . ఒక చీర పొడవు జాకెట్ పీ ' కలుపుకుంటే ఆరున్నర మీటర్లుగా లెక్కిస్తారు . ఈ లెక్కన కోటి చీరల ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది . 230 రూపాయలు విలువ చేసే చీరను దసరా పర్వదినం సందర్భంగా అందించాలని నిర్ణయిం చారు .
ఈ చీరను తయారు చేసినందుకు మీటరుకు 17 రూపాయలు చెల్లిస్తారు , చీర తయారీకి 110 రూపాయలు పడు తుండగా డయింగ్ చార్జీలు , ప్యాకింగ్ , రవాణా కలుపుకుంటే 230 రూపాయలు అవుతుందిగా అంచనా వేశారు . చేనేత , మరమగ్గాల కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి ఇప్పటికే చేనేత విస్త్రాల అమ్మకాలపై విస్తృ త ప్రచారం కల్పించారు .
సినీ నటులతో ప్రచారం కల్పించడమే కాకుండా తానే బ్రాండ్ అంబాసిడర్ గా తాను ప్రాతి నిథ్యం వహిస్తున్న సిరిసిల్లల కార్మికులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటు న్నారు .సిరిసిల్ల నేతన్నలు ప్రస్తుతం కేసీఆర్ కిట్ క్రింద గర్భిణి మహిళలకు అందించే చీర , టవల్ తయారీని కూడ ఇక్కడి వారే చేస్తున్నారు . ఇప్పటికే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ ఆర్డర్లు ఎక్కవ శాతం దక్కాయి .
ఒక్కో కార్మికుడికి కనీసం పదిహేనువేల రూపాయలు గిట్టుబాటు అలా పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని , పది గజాల చీరలు పదిలక్షలు తయారు చేయగా , 90 లక్షల చీరలు 5. 50 మీటర్ల చీరలు తయారు చేశారు . చీరతోపాటు 85 సెంటీమీటర్ల జాకెట్ బట్టను ఇవ్వను న్నారు. నాలుగు జిల్లాలలో కలిపి 10 లక్షల 82 వేల 41 చీలను పంపిణీ చేస్తారు . తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ చీరలు అందజేస్తారు .
కలెక్టర్ల ద్వారా, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లకు పంపిణీ బాధ్యతలు ఉంటాయి. ఆర్ పీ ల సేవలు , స్వయం సహాయక బృందాలసేవలను, ఆశావర్కర్ల సేవలను ఇందుకు ఉపయోగించుకోనున్నారు . కరీంనగర్ జిల్లాకు 2 లక్షల 48 వేల చీరలు కేటాయించారు. అలాగే జగిత్యాల జిల్లా కు 3 లక్షల 60 వేల చీరలు, అలాగే సిరిసిల్ల జిల్లాకు 2లక్షల 10 వేల చీరలుమరియు పెద్దపల్లి జిల్లా కు 2లక్షల 60 వేల చీరలు పంపిణి చేయనున్నారు.