కేసీఆర్ 90 ఎంఎల్ సీఎం. ఒక్క పెగ్గు వేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటడు. రెండు పెగ్గులు వేస్తే అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లిస్తానంటడు. మూడు పెగ్గులు వేస్తే దళితులకు మూడెకరాలు ఇస్తానంటడు. నాలుగో పెగ్గు వేసి కేటీఆర్ సీఎంను చేస్తానంటడు, ఐదో పెగ్గు పంచభూతాలను నేనే అంటడు. ఆరో పెగ్గేసి ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తనంటడు. ఏడో పెగ్గు వేశాక అసలు నేనేమీ అనలేదని బుకాయిస్తడు. ఇదీ 90 ఎంఎల్ చరిత్ర. అలాంటి పార్టీకి ఓటేస్తే తెలంగాణలో బతకగలుగతమా?
ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరదీసిండు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తానని హామీ ఇచ్చిండు. చివరకు నా లెటర్ కూడా ఫోర్జరీ చేసి ఆపించిండు. ఎన్నికలయ్యాక అందరికీ డబ్బులిస్తానని చెప్పి మళ్లీ మోసం చేసిండు
హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్ మళ్లీ ‘దళిత బంధు’ అంటున్నడు. ఈ పథకం ద్వారా ఇంటికో రూ.10 లక్షలిస్తడట. ఇవన్నీ ఒట్టి మాటలే. పథకం స్టార్ట్ చేసి 10 మందికో 100 వంద మందికో మాత్రమే ఇస్తడు. తరువాత కోర్టులో పిటిషన్ వేయించి ఆపిస్తడు. బీజేపీవల్లే, ఈటల రాజేందర్ వల్లే పథకం ఆగిపోయిందని మళ్లీ అబద్దపు ప్రచారం చేయిస్తడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా తెలంగాణలో అర్హులైన అందరికీ ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్ ను, మంత్రులను అడుగడుగునా నిలదీస్తాం.