సాంకేతికతకు దగ్గరై..వ్యక్తిగత సంబంధాలకు దూరమై జీవనం సాగిస్తున్న ఈ కాలంలోనూ అక్కడ అనాదిగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతరించిపోతున్న కళకు ఓ కుటుంబంలో ఏడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం వివిధ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు నేటికీ రంగ స్థల కళను పెంచిపోషిస్తున్న తీరుకు సలాం చెప్పాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
బ్రహ్మం గారి జీవిత చరిత్రకి సంబంధించిన నాటకం. దాదాపుగా ఐదవ తరం ప్రస్తుతం నాటకాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నడిపిస్తున్నారు. విశేషమేంటంటే దీనికోసం ప్రత్యేకంగా ఎక్కడెక్కడినుండో వచ్చిన పదేళ్ల పిల్లల నుండి మొదలు యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పూర్తి స్థాయి ప్రొఫెషనల్ గా ప్రాక్టీస్ చేసి మరీ ఇందులో తమ పాత్రకు జీవం పోస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దాదాపుగా 70 ఏళ్ల కిందట రామడుగు మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద కొందరు మిత్రులతో కలిసి బ్రహ్మంగారి జీవిత చరిత్రను మొదటిసారిగా నాటకంలాగా ప్రదర్శించారు గురువైన కట్టా లక్ష్మీనరసయ్య భాగవతార్. అప్పటి నుండి క్రమక్రమంగా ఆదరణ పెరగడంతో ప్రస్తుతం రామడుగు మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్ లో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)