Gold: బంగారు ఆభరణాలు ఆర్డర్ ఇస్తే ..అందులో పది గ్రాముల ప్యూర్ గోల్డ్‌కి స్వర్ణకారుడు చేసి ఇచ్చే నగల్లో ఎంత తరుగు ఉంటుంది. అసలు తరుగు ఎందుకు తీస్తారు. కస్టమర్‌కి ఇచ్చే గోల్డ్ నగలలో వేస్టేజ్ ఎంత ఉంటుందో తెలుసా.
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ముందుగా ఆరా తీసే విషయాలు రెండు. ఒకటి మార్కెట్లో గోల్డ్ ధర ఎంత.. ఆభరణం ఎంత బరువు ఉంది..అందులో తరుగు ఎంత అని కనుక్కుంటారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
బంగారంతో ఆభరణాలు తయారు చేసేటప్పుడు తరుగు ఎందుకు వస్తుంది. బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను సున్నా నుంచి 24 క్యారెట్ల రూపంలో చెబుతారు.అసలు ప్యూర్ గోల్డ్‌లో తరుగు ఎంత ఉంటుందనే వాస్తవాన్ని స్వర్ణకారులు చెబుతన్నారు.(ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
24 క్యారెట్ల బంగారంఅంటే అది 99.99 శాతం స్వచ్ఛమైనదని అర్థం.ఇందులో లెక్కలోకి తీసుకోలేనంత మొతదులో ఇతర లోహలు ఉంటాయి. 24క్యారెట్స్ బంగారం సున్నితంగా ఉండడంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
దీనికి గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహలను కలుపుతారు. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత 22 క్యారెట్ 18 క్యారెట్ నిర్ణయిస్తారు.(ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
21 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% బంగారం 8 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. అదే విధంగా 18 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో తే బంగారు శాతం 75% ఇతర లోహాలు 25% ఉన్నాయని అర్థం.(ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
ఎక్కువగా 24 క్యారెట్ల బంగారం తోటి ఆభరణాలు తయారు చేస్తారు. 10గ్రాముల బంగారని 60 వేల రూపాయలకు కొని స్వర్ణకరునికి ఇస్తే ఆభరణం తయారై కస్టమర్ చేతికి వచ్చే సరికి దాని బరువు తగ్గుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
10గ్రాముల బంగారానికి దాదాపు 200 మిల్లి గ్రాముల తరుగు లేదా వేస్టేజ్ పోతుంది. ఆభరణం తయారు చేస్తున్నపుడు వివిధ దశలలో ఆభరణానికి స్వర్ణకారుడు తీసుకునే 400మిల్లి గ్రామ్స్ లో 200మిల్లి గ్రామ్స్ వారి తయారీకి లేదా మజురిలో ఖర్చుచేసుకుంటారు.(ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
అంటే 10గ్రాములో 400మిల్లి గ్రాముల బంగారం పోతుందని అంటే కస్టమర్ ఇచ్చే బంగారం లో 9.6గ్రాముల బంగారం మాత్రమే ఉంటుందని స్వయంగా నగలు తయారు చేసే స్వర్ణకారులు చెబుతున్న మాట.(ప్రతీకాత్మకచిత్రం)