స్వీట్ వాయిస్... హాట్ వీడియోస్‌తో అబ్బాయిలను ముగ్గులోకి దింపి ఊరిస్తున్నారు. ఇక ఆ వీడియోలకు, వాయిస్‌లకు టెంప్ట్ అయ్యారో మటాష్. జేబు ఖాళీయే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్, ఆన్లైన్, వీడియో కాల్స్ మోసాలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ఓ యువతి.. ఓ యువకుడికి న్యూడ్ వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత అతన్ని బెదిరించింది. "లక్ష రూపాయలు ఇవ్వు.. లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను" అంది. షాకైన యువకుడు అన్లైన్లో 60 వేల రూపాయలు సమర్పించుకున్నాడు.
తెలంగాణ ... జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికుల ప్రకారం... స్థానిక ఓ యువకుడికి రెండు రోజుల కిందట ఢిల్లీకి చెందిన ఓ యువతి అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ చేసింది. రిసీవ్ చేసుకొని వీడియో కాల్ మాట్లాడాడు. అందాలు ఆరబోసింది. కవ్విస్తూ మాట్లాడింది. ఐతే.. తాను ఉచ్చులో చిక్కుకున్నానని అతను గ్రహించలేకపోయాడు." width="640" height="480" /> ఈ ఘటన తెలంగాణ... కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికుల ప్రకారం... స్థానిక ఓ యువకుడికి రెండు రోజుల కిందట ఢిల్లీకి చెందిన ఓ యువతి అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ చేసింది. రిసీవ్ చేసుకొని వీడియో కాల్ మాట్లాడాడు. అందాలు ఆరబోసింది. కవ్విస్తూ మాట్లాడింది. ఐతే.. తాను ఉచ్చులో చిక్కుకున్నానని అతను గ్రహించలేకపోయాడు.
ఢిల్లీ పోలీస్‌స్టేషనన్‌లో కంప్లైంట్ చేస్తాను.. నన్ను బ్లాక్మెయిల్ చేసి.. నాతో న్యూడ్ వీడియో కాల్ చేయించుకున్నావని చెబుతాను" అంది. ఆ యువకుడు లైట్ తీసుకున్నాడు. ఏం కాదులే అనుకున్నాడు." width="640" height="480" /> కాల్ తర్వాత... "నీతో మాట్లాడిన వీడియో కాల్ రికార్డు అయింది. నాకు లక్ష రూపాయలు పంపు... మనీ పంపకపోతే నీపై ఢిల్లీ పోలీస్‌స్టేషనన్‌లో కంప్లైంట్ చేస్తాను.. నన్ను బ్లాక్మెయిల్ చేసి.. నాతో న్యూడ్ వీడియో కాల్ చేయించుకున్నావని చెబుతాను" అంది. ఆ యువకుడు లైట్ తీసుకున్నాడు. ఏం కాదులే అనుకున్నాడు.
మర్నాడు ఢిల్లీ పోలీస్ స్టేషన్ నుంచి అంటూ ఆ యువకుడికి ఓ కాల్ వచ్చింది. "నేను కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను... నువ్వు ఏం చేశావో తెలిసింది. మర్యాదగా ఆమెకు మనీ ఇస్తావా లేక కేసు రాయమంటావా" అని బెదిరించాడు. ఆ కాల్ చేసింది నకిలీ కానిస్టేబుల్ అని యువకుడు గుర్తించలేకపోయాడు. అంతా నిజమే అనుకున్నాడు. బాగా టెన్షన్ పడ్డాడు. వెంటనే తన మొబైల్లో విడతల వారీగా మొత్తం రూ.60 వేల రూపాయలను ఆ యువతి పంపిన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్లోకి పంపాడు.
ఇదంతా జరిగిన తర్వాత బాధితుడి ఫ్రెండ్స్ అతనికి ధైర్యం చెప్పారు. ఇదంతా చీటింగ్ అని అతనికి తెలిసేలా జ్ఞానబోధ చేశారు. దాంతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు... ఆ యువతిపై కేసు నమోదు చేయాలంటూ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రాసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. రోజూ ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్లు ఇలాంటి నేరాలు చేస్తూ అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. బీకేర్‌ఫుల్.