అదే తప్పు ఉన్నతాధికారులు చేస్తే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం రివాజుగా మారుతోంది. ఇక్కడ చలాన్లు పెండింగులో ఉంచిన అధికారి చిన్నచితక అధికారి కాదు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అధికారిక వాహనం. ఈ వెహికల్పై 9 చలాన్లు పెండింగులో ఉన్నాయంటే అధికారులు ఏ విధంగా సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారో అర్థం అవుతోంది.
11.08.2022 అల్వాల్ పరిధిలోని శామిర్ పేట టిఆర్పీఎస్ లిమిట్స్... 03.10.2022 చేగుంట పరిధిలోని వడియారం బైపాస్... 03.10.22 బిక్కనూరు పరిధిలోని బిక్కనూర్ ఎగ్జిట్.. 29.12.2022 మాచారెడ్డి పరిధిలోని లక్ష్మీరావుల పల్లి... 03.01.2023 రామాయంపేట పరిధిలోని ధర్మార చెరువు ఎక్స్ రోడ్... చిక్కడపల్లి పరిధిలోని అప్పర్ ట్యాంక్ బండ్ రోడ్ లో చలాన్లు వేశారు.