దోమకుంట కోటతో పాటు హైదరాబాద్ లోని కుతుబ్షాహి టుంబ్స్ కాంప్లెక్‌లోని మెట్లబావి యునెస్కో అవార్డుకు ఎంపిక చేశారు. 2022 ఏడాదికి గాను ఆసియా-పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డుకు వివిధ దేశాల నుంచి మొత్తం 287 ప్రతిపాదనలు రాగా అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్ట్‌లను యునెస్కో ఎంపిక చేసింది.