రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
1/ 7
రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
2/ 7
ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
3/ 7
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చెరీష్ ఫౌండేషన్ లో ఉన్న 45 మంది బాలబాలికల చదువులకు సహకారం అందిస్తానని ప్రకటించారు.
4/ 7
గత 16 ఏళ్లుగా చెరీష్ ఫౌండేషన్ ను నిర్వహిస్తూ అనాధ పిల్లలకు ఆశ్రయమిస్తున్న డేవిడ్ సుబ్రమణ్యం కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలపారు.
5/ 7
ఆశ్రమంలో ఉన్న 45 మంది బాల బాలికలు తన కుటుంబ సభ్యులతో సమానం అన్న ఎమ్మెల్సీ కవిత, ఆశ్రమానికి సొంత స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
6/ 7
ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు సాధించేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు.
7/ 7
ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా ఆశ్రమంలోని బాలబాలికలు ప్రార్థనలు, భక్తి గీతాలు ఆలపించారు.