అకాల వర్షాలు మామిడి, మొక్క జొన్న అలాగే పసుపు సాగు రైతులును నిలువునా ముంచాయి, ఎకరం, రెండు ఎకరాలు కాదు ఏకంగా వేల ఎకరాలు మామిడి, మొక్క జొన్న పంట నీటి పాలు అయ్యింది.
2/ 10
మామిడి రైతుకు కోట్లు నష్టం మిగిల్చింది. అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గులాబ్ తుఫాన్ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి రైతులకు కన్నీరే మిగిలింది.
3/ 10
ఉమ్మడి కరీంనగర్ జిల్లలో రెండు రోజులుగా కురిసిన వర్షాలు కు వేల ఎకరాలు పంటలు నీటి పాలు అయ్యింది. కోట్లు నష్టం వాటిల్లింది. కురిసిన వర్షాలతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
4/ 10
రైతులు ఆరు కాలం కష్టించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో చల్గాల్, మెట్టుపల్లి , గంగాధర, చొప్పదండి,, మానకొండూర్, జమ్మికుంట, గ్రామాల్లో రబీ సాగులో వేల ఎకరాల్లో విస్తారంగా రైతులు మొక్క జొన్న పంటసాగు చేశారు.
5/ 10
అకాల వర్షాలు మళ్లీ రైతులును దెబ్బ తీశాయి. చేతికి వచ్చిన మొక్క జొన్న కళ్ల ముందే పొలంలో అకాల వర్షాలు దెబ్బ కు నేల పాలు అయ్యింది. ముదురు పంట ఆకాల వర్షాలు దెబ్బకు నేలకు ఒరిగి తేమ శాతానికి మొక్కలు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
6/ 10
వ్యవసాయి అధికారులు మొక్క జొన్న పంట నష్టపరిహారం పంట ఎకరాకు ప్రస్తుతం 5 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది.ఎకరాకు రైతులు యాభై వేలు పైనే పెట్టుబడి పెట్టారు. ప్రసుత్తం మార్కెట్లో క్వింటా ధర 22వందలు ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
7/ 10
ఎకరాకు ఏడు క్వింటాళ్లు మొక్క జొన్న దిగుబడి వస్తుంది. ప్రసుత్తం రైతులు అకాల వర్షాలు దెబ్బ కు ఎకరానికి వేళ నష్ట పోతున్నారు. తుపాను, అకాల వర్షాలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మొక్కజొన్న మామిడి రైతులు అంటున్నారు.
8/ 10
శుక్రవారం, శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి గాలి తోడవడంతో మండలం. లోని పలు గ్రామాల్లో భారీగా పంట నష్టం జరిగింది.ముఖ్యంగా జగిత్యాల జిల్లా దాదాపుగా 200 ఎకరాల్లో రైతులు మొక్క జొన్న సాగు చేశారు.
9/ 10
వర్షం కారణంగా మొత్తం మొక్క జొన్న పూర్తిగా నష్టపోయినట్టు రైతులు తెలిపారు. పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం రైతులను దెబ్బతీయడం వల్ల అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.
10/ 10
జగిత్యాల జిల్లా లో వ్యవసాయాధికారులు దెబ్బ తిన్న మొక్క జొన్న పొలాలను పరిశీలించి పూర్తి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అయితే పంట నష్టపోయిన రైతులు మాత్రం ..ప్రస్తుతం తమను ఆదుకునే మార్గం చూపించమని వేడుకుంటున్నారు.