Kondagattu Temple Theft Case: కొండగట్టు ఆలయ దొంగలను పట్టించిన బీరు సీసా..ఎలాగంటే?
Kondagattu Temple Theft Case: కొండగట్టు ఆలయ దొంగలను పట్టించిన బీరు సీసా..ఎలాగంటే?
ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఆ తప్పే నిందితున్ని పట్టిస్తుంది. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ చేసిన నిందితులు కూడా అలాగే దొరికిపోయారు. వారి చేసిన చిన్న తప్పే ఇప్పుడు వాళ్లను కటకటాల పాలు జేసింది. ఇంతకీ వాళ్లు చేసిన ఆ మిస్టేక్ ఏంటంటే? P.Srinivas,New18,Karimnagar
ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఆ తప్పే నిందితున్ని పట్టిస్తుంది. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ చేసిన నిందితులు కూడా అలాగే దొరికిపోయారు. వారి చేసిన చిన్న తప్పే ఇప్పుడు వాళ్లను కటకటాల పాలు జేసింది. ఇంతకీ వాళ్లు చేసిన ఆ మిస్టేక్ ఏంటంటే?
2/ 12
తెలంగాణ పుణ్యక్షేత్రం జగిత్యాల కొంగట్టు అంజన్న ఆలయంలో చోరీ జరగటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
3/ 12
సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటించిన కొద్దిరోజులకే ఆలయంలో చోరీ జరగటం కలకలం రేపింది. ఆలయంలోని గర్భ గుడిలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు 15 కేజీల బరువున్న వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
4/ 12
వెండి ఫ్రేమ్, శఠగోపం, వెండి గొడుగు, వెండి రామ రక్ష ఇలా వివిధ రకాల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
5/ 12
సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చోరీ వ్యవహారంపై సీఎంవో కార్యాలయం కూడా ఆరా తీసిన నేపథ్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట ప్రారంభించారు.
6/ 12
సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు కర్ణాటకలోని బీదర్ లో వారిని అరెస్టు చేశారు. చోరీకి ముందు దొంగలు రెండు సార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. సీఎం గత నెల 15న కొండగట్టులో పర్యటించగా..అంతకు ముందే ఒకసారి రెక్కీ నిర్వహించారు.
7/ 12
ఆ తర్వాత గత నెల 22న మరోసారి రెక్కీ నిర్వహించారు. 23న అర్థరాత్రి తర్వాత ముసుగులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశించి 15 కేజీల బరువున్న వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. చోరీ తర్వాత ఆలయం వెనకాల తీరిగ్గా బీర్లు తాగి..అక్కడి నుంచి వెళ్లిపోయారు.
8/ 12
అయితే నిందితులు తాగి పడేసిన బీరు బాటిళ్లే వాళ్లను పట్టించాయి. విచారణలో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆలయ పరిసరాల్లో ఆధారాల కోసం ప్రయత్నించారు. రాబిన్ అనే డాగ్.. నిందితులు తాగి పడేసిన బీరు బాటిల్ వద్దకు వెళ్లి ఆగింది.
9/ 12
ఖాళీ బీరు సీసాను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ల్యాబ్ కు పంపించారు. సీసాపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ సాయంతో ఆధార్ కార్డ్ వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు.
10/ 12
తండాకు వెళ్లి విచారణ చేయగా..వీరు దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారి సెల్ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్రాక్ చేయగా..నిందితులు కర్ణాటకలోని బీదర్ లో ఉన్నట్లు తెలిసింది.
11/ 12
రెండ్రోజుల క్రితం పది బృందాలను కర్ణాటకకు పంపించిన పోలీసులు..స్థానికుల సాయంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
12/ 12
వారి వద్ద నుంచి వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చోరీ కేసు వివరాలను వెల్లడించిన జగిత్యాల ఎస్పీ భాస్కర్.. నిందితులను పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు డాగ్ రాబిన్ కు థ్యాంక్స్ చెప్పారు.