పూర్వం రామ రావణ యుద్ధము జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. ఆంజనేయస్వామి సంజీవనిని తెస్తుండగా ముత్యంపేట అనే ఈ మార్గమున కొంత భాగం విరిగిపడిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కొండ పర్వత భాగమే ఇప్పుడున్న కొండగట్టుగా పిలుస్తున్నారని భక్తులు చెబుతున్నారు.(Photo:Facebook)
నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి యుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం.(Photo:Facebook)