ISOLATION CENTER IN CEMETERY AT KISHTAMPALLI MAHABUBNAGAR DISTRICT IN TELANGANA VB MBNR
Isolation Center in Cemetery: శ్మశానవాటికే ఐసోలేషన్.. తండావాసుల వినూత్న నిర్ణయం.. ఎక్కడంటే..
Isolation Center in Cemetery: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాలని తండావాసులు నిర్ణయించుకున్నారు. తిండి, నిద్రా అంతా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. తండాలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావటంతో అది మరింతమందికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం ఏకంగా శ్మశానంలోనే ఐసోలేషన్ గా మార్చేసుకుని అక్కడే ఉంటున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగల నవాబుపేట మండలంలోని కిష్టం పల్లి గ్రామపంచాయతీ వైకుంఠధామమే ఐసొలేషన్ కేంద్రంగా తయారు చేసుకున్నారు అక్కడి తండావాసులు. కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది .
2/ 11
ఎవరి ద్వారా ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. రెండు దశలో చిన్నారులు కూడా దీని బారిన పడుతుండడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన మొదలైంది.
3/ 11
దీంతో గ్రామాల్లో తాండాలో నివసిస్తున్న రైతులు తమ పిల్లలను తమతో పాటే పొలం వద్దకు తీసుకెళ్లి పగలంతా అక్కడే ఉంటున్నారు.
4/ 11
360 మంది జనాభా ఉన్న ఈ తండాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్లంతా కలిసి వైరస్ వాప్తి చెందితే.. మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు.
5/ 11
దీంతో అందరూ కోవిడ్ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆరుగురు వైరస్ బారిన పడినట్లుగా తేలింది.
6/ 11
అంతే..అది మరింతగా వ్యాప్తి చెందకుండా బాధ్యతగా వ్యవహరించారు. వీరందరూ ఆ వైకుంఠధామం లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
7/ 11
అక్కడే అన్నం, నీరు , తిండి, నిద్ర చేస్తున్నారు. మా వల్ల గ్రామాల్లో కరోనా ఎక్కువగా వ్యాపించకుండా ఉండాలనే ప్రయత్నం లో భాగంగా ఇలా చేస్తున్నామంటూ తాండావాసులు తెలిపారు.
8/ 11
మరికొందరు పొలాల నుంచి చీకటి పడే సమయానికి పిల్లల ఇళ్లకు చేరుకుంటున్నారు.
9/ 11
నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు బాధితులకు రెండు పూటలా భోజనం వండి తీసుకొచ్చి పెట్టేవారు.
10/ 11
తరువాత రుద్రారానికి చెందిన యువత వీరికి ప్రతీరోజు ఆహారం తీసుకొచ్చి ఇస్తున్నారు.
11/ 11
వైకుంఠధామంలో ఉంటున్న పాజిటివ్ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.