1. ఐఆర్సీటీసీ భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్‌ను మళ్లీ ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్లో దక్షిణ భారతదేశ యాత్రను ప్రకటించింది ఐఆర్సీటీసీ. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ దక్షిణ భారతదేశ యాత్ర టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7140. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8610. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, ధర్మశాలలు, హాల్స్, డార్మిటరీల్లో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ లీటర్ వాటర్ బాటిల్ లాంటివి కవర్ అవుతాయి. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. డిసెంబర్ 13న ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీరంగం, బృహదీశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు తిరుచ్చిరాపల్లి నుంచి బయల్దేరతారు. మరుసటి రోజు డిసెంబర్ 14 తెల్లవారుజామున 5 గంటలకు రామేశ్వరం చేరుకుంటారు. అక్కడే సముద్ర స్నానం, 22 తీర్థం, రామనాథస్వామి దర్శనం పూర్తి చేసుకోవాలి. రాత్రికి రామేశ్వరంలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)