యోగథాన్ లో పాల్గొన్న తెలంగాణా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ, 2050 సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని, ఈ ప్రస్థానంలో మన దేశపు యువత ప్రధాన పోషించనున్నారని తెలిపారు. అటువంటి యువత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రతీరోజూ యోగా తప్పక చేయాలని సూచిస్తూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన ఈ యోగథాన్ కార్యక్రమం యువతలో కొత్త స్ఫూర్తిని నింపిదని అన్నారు.
నగరంలోని ప్రముఖ కళాశాలలైన వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉస్మానియా వైద్యకళాశాల, ఎమ్.జి.ఐ.టి., నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, వి.ఎన్.ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల, సి.బి.ఐ.టి., ట్రిపుల్ ఐటీ, బిట్స్, ప్రభుత్వ ఆయుర్వేత కళాశాల, జాతీయ పౌష్టికాహార సంస్థ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల, ఏకం ఐ.ఎ.ఎస్ అకాడమీ తదితర సంస్థలనుండి అనేకమంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు.
యోగథాన్ లో పేర్లు నమోదు చేసుకుని 108 సూర్యనమస్కారాలు విజయవంతంగా పూర్తిచేసినవారికి గోల్డ్ సర్టిఫికెట్, 54సార్లు చేసినవారికి సిల్వర్ సర్టిఫికెట్, పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అందచేస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా వారందరికీ షర్టులు, యోగా మ్యాట్లు, హైటెక్స్ ప్రాంగణంలోఉచితంగా అందజేశారు.