Rain Alert: తగ్గిన వానలు.. కానీ తెలంగాణలోని ఈ జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన..

Telangana Rains: వారం రోజుల పాటు తెలంగాణను వణికించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.