Rain Alert: ఇవాళ, రేపు కుండపోత వానలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Rain Alert: ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక తెలంగాణలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి 2 రోజుల పాటు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి ఉదయం వరకు భారీ వర్షాలకు కురుస్తాయని హెచ్చరించింది.