Telangana Rains: నేడు భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వానలు పడుతున్నాయి. దీనికి తోడు ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయి.