IMD HYDERABAD FORECASTS 4 DAYS RAIN IN TELANGANA HERE IS LATEST BULLETIN DETAILS SK
Telangana Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన.. ఐఎండీ తాజా బులెటిన్ వివరాలు
Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ వానలు దంచికొడుతున్నాయి. ఐతే మరో నాలుగు రోజులు పాటు వర్షాలు పడతాయని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది.
తెలంగాణలో రుతుపవనాల చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి.
2/ 6
గురువారం ఉదయం 10 వరకు.. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
3/ 6
అంతేకాదు ఆగస్టు 29 ఉదయం 08.30 వరకు.. తెలంగాణవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతవరణశాఖ వెల్లడించింది.
4/ 6
ఆగస్టు 29 ఉదయం నుంచి ఆగస్టు 30 వరకు.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
5/ 6
హైదరాబాద్‌లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం కూడా పలు చోట్ల వాన పడింది. ఇక నిజామాబాద్ జిల్లా కోటగిరిలో కుంభవృష్టి కురిసింది. ఇక్కడ అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.