తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కి.మీ ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
సెప్టెంబరు 21న ఉదయం 08.30 నుంచి సెప్టెంబరు 22న ఉదయం 08.30 వరకు.. తెలంగాణలోని చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)