Rain Alert: వరద ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..

Rain Alert: తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. ఐతే ఇవాళ కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.