Telangana: తెల్ల రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక.. అలా చేశారో మీ కార్డు రద్దు..
Telangana: తెల్ల రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక.. అలా చేశారో మీ కార్డు రద్దు..
Telangana : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా? నెలా నెలా రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకోండి. లేదంటే మీ కార్డు రద్దయ్యే అవకాశముంది.
మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా? నెలా నెలా రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకోండి. లేదంటే మీ కార్డు రద్దయ్యే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రేషన్ కార్డులపై మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. బీపీఎల్ కుటుంబాలకు కొంతకాలంగా తెల్ల రేషన్ కార్డుల జారీ చేయడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. (ఫైల్ ఫొటో)
3/ 7
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తెలంగాణలో 80 శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 79 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.
4/ 7
తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,59,974 మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశారు. మరో 92 వేల దరఖాస్తులను తిరస్కరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇక 4,88,775 రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఆహార భద్రతా కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే వెరిఫై చేసి ప్రతి ఒక్క అర్హుడికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 44, 734 రేషన్ కార్డులు ఇచ్చారు. మరో 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా కారణంగానే కొత్త కార్డులను జారీ చేయలేకపోయామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
మూడు నెలలు వరుసగా రేషన్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రేషన్ కార్డు రద్దు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)