వాణి ఇంగ్లీష్ లో 70, 78 మార్కులు... తెలుగులో 76, 87 మార్కులు.. ఎకనామిక్స్ లో 35, 76 మార్కులు.. కామర్స్ లో 53, 87 మార్కులు.. సివిక్స్ లో 63, 87 మార్కులు తెచ్చుకుంది. టెన్త్ లో వీణ 9.3 జీపీఏ సాధిస్తే.. వాణి 9.2 జీపీఏ సాధించడం విశేషం. ఈ మార్కులు కాదు.. వీరి పట్టుదల, డెడికేషన్ కు వంద మార్కులు వేయాల్సిందే.
జిల్లాలో 2003 అక్టోబర్ 15న జన్మించారు ఈ అవిభక్త కవలలు. ఇద్దరినీ విడదీసేందుకు వైద్య నిపుణులు ప్రయత్నించినప్పటికీ అది రిస్క్ అని తేల్చారు. దీంతో.. కలిసి ఉన్నంత కాలం ఇలా కలిసే ఉండాలని ఈ అక్కాచెల్లెళ్లు నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ లైఫ్ లో అనుకున్నది సాధించాలని మనసారా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ట్విన్స్.