YS Sharmila: హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆమె ఇంటి నుంచి ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు యత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు.
2/ 6
దీనితో ఇటు పోలీసులకు, అటు వైఎస్సార్టీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో షర్మిల ఒక్కసారిగా కిందపడిపోయారు.
3/ 6
దీనితో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వైఎస్సార్టీపి శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
4/ 6
'ఉస్మానియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు. 200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ 9 ఏళ్ల క్రితం చెప్పాడు. ప్రజలకు వైద్యం అందడం లేదని నాకు ఫిర్యాదులు వచ్చాయని' షర్మిల పేర్కొన్నారు.
5/ 6
'మా దగ్గర కత్తులు, కర్రలు, రాళ్లు లేవు. నేను ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తున్నాను. నాతో పాటు మీడియా తప్ప ఎవరూ రారని' షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
6/ 6
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని షర్మిల మండిపడ్డారు. ప్రజల గొంతు వినిపించిన అరెస్టులు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.