Balapur Ganesh Laddu-YS Jagan: సీఎం జగన్ కు కానుకగా బాలాపూర్ లడ్డూ.., రికార్డు ధరకు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ..
Balapur Ganesh Laddu-YS Jagan: సీఎం జగన్ కు కానుకగా బాలాపూర్ లడ్డూ.., రికార్డు ధరకు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ..
తెలుగు రాష్ట్రాల్లో (Telugu State) బాలాపూర్ వినాయకుడికి (Balapur Ganesh) ప్రత్యేకస్థానం ఉంది. ముఖ్యంగా బాలాపూర్ వినాయకుని లడ్డూకి (Balapur Ganesh laddu) కూడా ఎక్కడా లేని డిమాండ్ ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేకస్థానం ఉంది. ముఖ్యంగా బాలాపూర్ వినాయకుని లడ్డూకి కూడా ఎక్కడా లేని డిమాండ్ ఉంది.
2/ 8
బాలాపూర్ వినాయకుడి లడ్డూని దక్కించుకునేందుకు ప్రతిఏటా భక్తులు పోటీపడుతున్నారు. అందుకే గణనాథుడి లడ్డూధర లక్షల రూపాయలు పలుకుతుటుంది.
3/ 8
గత ఏడాది కరోనా కారణంగా లడ్డూని తెలంగాణ సీఎం కేసీఆర్ బహూకరించిన ఉత్సవ సమితి.. ఈ ఏడాది ఘనంగా నవరాత్రులు జరిపి వేలంపాట నిర్వహించింది.
4/ 8
ఆదివారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ధర గత రికార్డులను బద్దలు కొట్టింది. కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శశాంక్ అనే మరో వ్యక్తితో కలిసి లడ్డూనికి ఏకంగా రూ.18.90లక్షలకు దక్కించుకున్నారు.
5/ 8
ఈ లడ్డూని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రకటించారు. అందుకే వేలంలో ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినట్లు రమేష్ యాదవ్ వెల్లడించారు.
6/ 8
కడప జిల్లాకు చెందిన రమేష్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. సీఎం జగన్ తనకు కల్పించిన అవకాశానికి కృతజ్ఞతగా లడ్డూని బహుకరిస్తున్నట్లు తెలుస్తోంది.
7/ 8
బాలాపూర్ లడ్డూ వరుసగా రెండేళ్లు సీఎంల వద్దకే చేరడం విశేషం. గత ఏడాది ఉత్సవ కమిటీ లడ్డూనికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వగా.. ఈసారి వైసీపీ ఎమ్మెల్సీ దక్కుంచుకొని ఆంధ్రా సీఎం జగన్ కు ఇస్తున్నారు.
8/ 8
తెలుగు రాష్ట్రాల్లో (Telugu State) బాలాపూర్ వినాయకుడికి (Balapur Ganesh) ప్రత్యేకస్థానం ఉంది. ముఖ్యంగా బాలాపూర్ వినాయకుని లడ్డూకి (Balapur Ganesh laddu) కూడా ఎక్కడా లేని డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.